Welcome to WebVihar

Start Your Online News Website

న్యూస్ వెబ్ సైట్ ఎందుకు? : ప్రతి రోజు పబ్లిష్ అయ్యే దినపత్రికల్లో స్థానిక వార్తలు చాలా తక్కువ సంఖ్యలో ప్రచురితం కావడం వలన ప్రజల వాణి వినిపించే అవకాశం ఉండటం లేదు. మీ గ్రామం/మండలం లోకల్ న్యూస్ ఎక్కువగా కవర్ చేయగల న్యూస్ పేపర్ ఉంటే స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయవచ్చు. లోకల్ న్యూస్ పేపర్, ప్రింట్ మీడియాలో పబ్లిష్ చేయాలంటే చాలా పెట్టుబడి అవసరమవుతుంది. న్యూస్ ప్రింట్ కొనుగోలు, ప్రింటింగ్, డిస్ట్రిబ్యూషన్ పనులకు విరివిగా డబ్బులు ఖర్చు చేయవలసి ఉంటుంది. అందువలన ఆన్ లైన్ న్యూస్ వెబ్ సైట్ ప్రారంభిస్తే, తక్కువ ఖర్చుతో ప్రపంచ వ్యాప్తంగా మీ స్థానిక వార్తలను ఇటు ప్రభుత్వం దృష్టికి మరియు ప్రజల దృష్టికి తీసుకు రావచ్చు! తద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయవచ్చును.

ఎలా ప్రారంభించాలి : మీరు నివసిస్తున్న మండలం/తాలూకా/జిల్లా కేంద్రం పేరుతో మీరు న్యూస్ వెబ్ సైట్ ప్రారంభించవచ్చును. ముందుగా పేరు నిర్ణయించుకొని, డొమైన్ నేమ్ మరియు సర్వర్ హోస్టింగ్ స్పేస్ బుక్ చేసుకోవాలి. న్యూస్ వెబ్ సైట్ కొరకు న్యూస్ పేపర్ మాడ్యూల్ కొని సెటప్ చేసుకోవాలి. ప్రతి రోజు స్థానికంగా జరిగే కార్యక్రమాలను కవర్ చేస్తూ, ఆ వార్తలను ఫొటోలతో సహా మీరు కోరిన భాషలో వెబ్ సైట్ అడ్మిన్ పేజీ ద్వారా ఎప్పటికప్పుడు పోస్ట్ చేయాలి. స్థానికులు మీ సైట్ ను మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా చూస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పంపమని కోరితే, పబ్లిక్ నుంచి మంచి స్పందన వస్తుంది. వాటిని వెబ్ సైట్ నందు ఉంచడం వలన వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఘనత మీకు దక్కుతుంది. మీరు ఆన్ లైన్ న్యూస్ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నామన్న సంతృప్తి కలుగుతుంది.

ఆదాయం వచ్చే మార్గాలు : న్యూస్ వెబ్ సైట్ నందు స్థానిక రియల్ ఎస్టేట్ యాడ్స్, స్కూల్స్, కాలేజీలు, షో రూమ్స్, డిస్కౌంట్ సేల్, హాస్పిటల్స్ మరియు వివిధ షాప్స్ బిజినెస్ యాడ్స్ సేకరించి డిస్ప్లే చేయవచ్చు. దీని కొరకు యాడ్స్ టారిఫ్ తయారు చేసుకోవాలి. టారిఫ్ ప్రకారం యాడ్ చార్జీలు తీసుకోవటం వలన మంచి ఆదాయం లభిస్తుంది. గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా కూడా యాడ్స్ మీ వెబ్ సైట్ నందు డిస్ప్లే చేయవచ్చును. మీ సైట్ చూసే వారు గూగుల్ యాడ్స్ మీద క్లిక్ చేస్తే, మీకు కొంత ఆదాయం జెనరేట్ అవుతుంది. అమెజాన్ షాపింగ్ వెబ్ సైట్ వారి యాడ్స్ కూడా మీ సైట్ నందు డిస్ప్లే చేయవచ్చు. మీ సైట్ చూసే వారు అమెజాన్ వారి యాడ్ క్లిక్ చేసి ఏదైనా పర్చేజ్ చేస్తే, మీకు కొంత కమీషన్ జెనరేట్ అవుతుంది.

న్యూస్ వెబ్ సైట్ కు ఎంత పెట్టుబడి కావాలి : ఆన్ లైన్ న్యూస్ వెబ్ సైట్ ఏర్పాటు చేసుకోవటానికి రూ. 30,000 ఖర్చు అవుతుంది. మీ ఇంటి నుంచే నిర్వహించుకోవటం వలన ఆఫీస్ అద్దె తదితర ఖర్చులు సేవ్ అవుతాయి. వెబ్ సైట్ గురించి ప్రజలకు తెలియజేయటానికి స్థానిక పత్రికల్లో యాడ్స్ ఇవ్వాలి. వాల్ పోస్టర్లు, పాంప్లెట్స్, వాట్సాప్ ద్వారా మీ వెబ్ సైట్ గురించి బాగా పబ్లిసిటీ చేసుకోవాలి. ఈ ఖర్చు వెబ్ సైట్ లాంచ్ చేసినప్పుడు ఒక్క సారి చేస్తే సరిపోతుంది. మీ న్యూస్ వెబ్ సైట్ ను స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేదా ఎంపిపి ద్వారా ప్రారంభింపచేస్తే కొంత ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుంది.

న్యూస్ వెబ్ సైట్ ఎవరు తయారు చేస్తారు : వెబ్ విహార్ అనే సంస్థ మీ న్యూస్ వెబ్ సైట్ డొమైన్, హోస్టింగ్ మరియు న్యూస్ పేపర్ మాడ్యూల్ సెటప్ చేసి మొత్తం వెబ్ సైట్ తయారు చేసి మీకు అందజేస్తుంది. మీరు న్యూస్ ఎలా పోస్ట్ చేయాలో ఆన్ లైన్ ట్యుటోరియల్ వీడియో ద్వారా శిక్షణ పొందవచ్చును. వెబ్ విహార్ వారి వివరాలు క్రింద ఇవ్వబడినవి.
న్యూస్ వెబ్ సైట్ ఏర్పాటు చేసుకోవటానికి ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన పేమెంట్ బటన్ క్లిక్ చేసి డబ్బులు చెల్లించి, మీ పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ వివరాలు మరియు మీ వెబ్ సైట్ పేరును క్రింద తెలిపిన ఇమెయిల్ కు పంపాలి. మీ పేమెంట్ అందిన వెంటనే వెబ్ విహార్ సంస్థ మీ న్యూస్ వెబ్ సైట్ ఏర్పాటు చేసి మీకు సమాచారం అందిస్తుంది.

 

 

 
 
Copyright © 2013  : : WebVihar.Com,  All Rights Reserved. : :